కరీంనగర్ ప్రభుత్వ ఐటిఐల్లో అడ్మిషన్ల సందడి.. పోస్టర్ విడుదల చేసిన మున్సిపల్ చైర్మన్.

కరీంనగర్ ప్రభుత్వ ఐటిఐల్లో అడ్మిషన్ల సందడి.. పోస్టర్ విడుదల చేసిన మున్సిపల్ చైర్మన్.

జమ్మికుంట టౌన్ మే 14 (తెలంగాణ ముచ్చట్లు):
 
కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐలు, ఏటీసీలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానం పలుకుతున్నట్లు మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ తెలిపారు. ఈ మేరకు ప్రవేశాల పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత సాంకేతిక విద్యను అభ్యసించి ఉపాధి అవకాశాలను పొందేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ప్రైవేట్ ఐటీఐలతో పాటు ప్రభుత్వ ఐటీఐలు, ఏటీసీలలో కూడా అర్హులైన విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.
కరీంనగర్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ కె. అశోక్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఎలక్ట్రిషియన్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (సీఓపీఏ ), డ్రెస్ మేకింగ్, వెల్డర్, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఐవోటీ టెక్నీషియన్ స్మార్ట్ అగ్రికల్చర్, వర్చువల్ అనాలిసిస్ అండ్ డిజైనర్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్, అడ్వాన్స్డ్ సీఎన్‌సీ టెక్నీషియన్, మ్యానుఫాక్చరింగ్ ప్రాసెసింగ్ ఆటోమేషన్ కంట్రోల్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
అభ్యర్థులు SSC అర్హతతో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, https://iti.telangana.gov.in⁠� వెబ్‌సైట్‌లో రూ.100 ఫీజు చెల్లించి వచ్చే నెల 8వ తేదీలోపు దరఖాస్తు సమర్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎండీ ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .