అతివేగం ప్రమాదానికి కారణమా..?
Views: 9
On
జమ్మికుంట టౌన్ మే 09 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మండలం రామన్నపల్లి సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. జమ్మికుంట నుంచి ఇల్లంతకుంట వైపు అతివేగంగా వెళ్తున్న ఓ కారు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.
ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే వాహనం పూర్తిగా దెబ్బతినడంతో పాటు విద్యుత్ స్తంభం ధ్వంసమై ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments