ఖమ్మంలో దారుణం.
భర్త, కూతురిని చంపిన రమ్య...?
Views: 3
On
-మూడు రోజులుగా మృతదేహాలతో...
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 27(తెలంగాణ ముచ్చట్లు )
ఖమ్మం మామిళ్ళ గూడెం లో దారుణం చోటుచేసుకుంది.ఓ ఇంట్లో తండ్రీ కుమార్తె మృతి చెందగా తల్లి మరో కూతురు అపస్మారక స్థితిలో ఉండడాన్ని ఆదివారం రాత్రి పోలీసులు గుర్తించారు. అయితే తండ్రీ కుమార్తె మూడు రోజుల క్రితమే మృతి చెందినట్లు అనుమానం వ్యక్తమవుతుండగా భార్యే హత్య చేసి ఉంటుందని సందేహిస్తున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనంతనగర్ కి చెందిన కణతాల రాము (36) ఓ డిజిటల్ పత్రికలో విలేకరి గా పని చేస్తూ భార్య రమ్య(31) కుమార్తెలు దివ్య(5) దీక్షిత(3)తో కలిసి మామిళ్ళ గూడెం సాయి బాబా గుడి సమీపంలో అద్దే ఇంట్లో ఉంటున్నాడు. నాలుగైదు రోజులుగా రాముకు ఆయన కుటుంబ సభ్యులు ఫోన్ చేసిన ఎత్తకపోగా ఆయన భార్య రమ్య ఫోన్ ఎత్తి ఆయనకు ఆరోగ్యం బాగా లేక తాను మాట్లాడుతున్నట్లు చెబుతోంది. ఆదివారం ఉదయం ఒక మహిళ రమ్య ఇంటికి వచ్చి పిలవగా రమ్య దుప్పటి కప్పుకుని బయటకు వచ్చి రాము అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు చెప్పింది. ఇంట్లో దుర్వాసనపై ఆరా తీయగా ఇంట్లో ఎవరికీ బాగాలేకపోవడంతో శుభ్రం చేయలేదని బదులిచ్చింది. కాగా ఆదివారం రాత్రి రమ్య సోదరుడు వీరి ఇంటికి వచ్చి తలుపు కొట్టగా స్పందన లేకపోవడం దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఖమ్మం టూటౌన్ సీఐ బాలకృష్ణ చేరుకుని ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా మంచం కింద రాము కూతురు దివ్య మృతదేహాలు కనిపించాయి. గది నిండా రక్తం కారి ఉంది. అప్పటికే ఇద్దరి మృతదేహాలు కుళ్లిపోయి కనిపించాయి. మంచం పక్కనే రమ్య చిన్నకూతురు దీక్షిత అపస్మారక స్థితిలో ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. మృతదేహలను పోస్టుమార్టానికి తరలించారు.
మూడు రోజులుగా మృతదేహాలతో
మూడు రోజులపాటు మృతదేహాలతో ఇంట్లోనే రమ్య ఉన్నా అబద్ధం ఆడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త కుమార్తెను హత్య చేసి గుట్టురట్టు కాకుండా ఎలుకల మందు కాస్త తాగి చిన్న కూతురుకు కూడా తాగించి ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాక చిన్న కూతురు తలపై గాయాలు ఉండటంతో ఆమెను కూడా హత్య చేయడానికి పథకం రూపొందించి ఉంటుందని భావిస్తున్నారు. మూడు రోజుల క్రితమే వారు మృతి చెందితే భయపడి తాను బయటకు చెప్పలేదని అంగీకరించినా కారణాలు చెప్పడానికి మాత్రం రమ్య నిరాకరించినట్లు తెలిసింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
27 Apr 2026 22:27:38
వేలేరు, ఏప్రిల్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలో ఐకేపి సెంటర్లలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడింది. సోమవారం కురిసిన వర్షంతో రైతులు కష్టపడి...


Comments