చిల్పూర్ మండలంలో ఘనంగా బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
Views: 2
On
-మండల కేంద్రంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన ఇంచార్జ్ రమేష్ నాయక్
-ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-బిఆర్ఎస్ పార్టీ మండల ఇంచార్జ్ రమేష్ నాయక్ పిలుపు
చిల్పూర్,ఏప్రిల్27(తెలంగాణ ముచ్చట్లు):
బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని చిల్పూర్ మండల కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ మండల ఇంచార్జి మాలోతు రమేష్ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల ఇంచార్జి రమేష్ నాయక్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం రమేష్ నాయక్ మాట్లాడుతూ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, యువతను ఆకర్షిస్తూ సంస్థాగతంగా బలమైన నిర్మాణాన్ని ఏర్పరచాలని సూచించారు. మండల స్థాయిలో సమన్వయం పెంచి, ప్రతి బూత్‌లో పార్టీ పట్టు పెరగేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై చురుకుగా స్పందిస్తూ ప్రజలకు చేరువ కావడం ద్వారానే పార్టీ బలం పెరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ డైరెక్టర్ బత్తుల రాజన్ బాబు, మారాపాక రమేష్, పొగాకుల విష్ణు వర్ధన్, మాజీ సర్పంచ్ వడ్లూరి మమత వెంకటేష్, చుక్క రాజేష్, గడ్డమీది మహేందర్, మోటం వెంకన్న, భూక్యా విజయ్, ఎడ్ల మహిపాల్, సాధం విష్ణు, బిక్షపతి, బుస యాదగిరి, బట్టు రెడ్డి, పల్లె
అంజి, మాలోతు గాంధీ, భూక్యా వరుణ్ సహా మహిళలు పాల్గొన్నారు.
అంజి, మాలోతు గాంధీ, భూక్యా వరుణ్ సహా మహిళలు పాల్గొన్నారు.Tags:
Related Posts
Post Your Comments
Latest News
27 Apr 2026 22:27:38
వేలేరు, ఏప్రిల్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలో ఐకేపి సెంటర్లలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడింది. సోమవారం కురిసిన వర్షంతో రైతులు కష్టపడి...


Comments