మణిగిల్ల గ్రామంలో మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి 

సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ 

మణిగిల్ల గ్రామంలో మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి 

పెద్దమందడి,ఏప్రిల్26( తెలంగాణ ముచ్చట్లు):
 
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలో ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు మరో ముఖ్యమైన చర్యగా, ఆదివారం  ఉదయం మార్నింగ్ వాక్ సందర్భంగా చౌట చెరువు పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ ముప్పూరి గణేష్ కుమార్ మరియు ఇతర గ్రామ ప్రతినిధులతో కలిసి చౌట చెరువును సందర్శించారు.గ్రామ ప్రజలు పండుగలు, దినాల కార్యక్రమాలు తరచూ చెరువు కట్ట వద్ద నిర్వహించడం జరుగుతుండగా, వేసవిలో ఎండలు, వర్షాకాలంలో వర్షాలు కారణంగా వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం గుర్తించారు.ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, చెరువు వద్ద మట్టి వేసి స్థలం సమతలీకరణ (లెవెలింగ్) చేసి, ప్రజలకు సౌకర్యంగా ఉండేలా శాశ్వత రేకుల షెడ్ నిర్మాణానికి సర్పంచ్ శ్రీకారం చుట్టారు. పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
అదేవిధంగా, గ్రామ స్మశాన వాటికలో పేరుకుపోయిన చెత్త మరియు కంపచెట్ల తొలగింపు పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ చర్యల ద్వారా గ్రామంలో పరిశుభ్రత మెరుగుపడటంతో పాటు ప్రజలకు మరింత సౌకర్యం కలగనుంది.ఈ కార్యక్రమంలో గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ రామ్ రెడ్డి, సుంచరమోని వెంకటయ్య, గరే మోని కొములయ్య, ముప్పురి రాములు, జి. బాలరాజు, ఎస్. మల్లీ, నరేందర్ గౌడ్ (మాజీ సింగిల్ విండో డైరెక్టర్), రామిరెడ్డి (మాజీ ఉప సర్పంచ్), ముప్పురి బుచ్చయ్య, ఆర్. ఆనంద్ రెడ్డి, ప్రేమ్ కుమార్ రెడ్డి, కుపేందర్ రెడ్డి, బీకే శ్రీకాంత్ రెడ్డి, గుంటి శివకృష్ణ సాగర్, ఎం. సాయి కుమార్, ముప్పురి నాగరాజు, బోడి గణేష్, కుమ్మరి బుచ్చయ్య, వడ్డే చంద్రయ్య, మోడీ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .