దళిత రత్న నీరటి సాయిరాజ్ కు ఘనంగా సన్మానం .
Views: 11
On
కాజీపేట్ ఏప్రిల్ 25 (తెలంగాణ ముచ్చట్లు)
అధ్యక్షుడు మర్యాల కృష్ణ జనరల్ సెక్రెటరీ బండి విజయ్ కుమార్ అధ్యక్షతన సంఘం వైస్ ప్రెసిడెంట్ సాయిరాజు ఇటీవల దళితరత్న అవార్డు అందుకున్న సందర్భంగా శాలువా కప్పి పూలమాలలు వేసి జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు మర్యాల కృష్ణ మాట్లాడుతూ సమాజ సేవ చేసే వారికి ప్రతిష్టాత్మక దళిత రత్న అవార్డును జిల్లా కలెక్టర్ చాహత్ వాజ్పేయి చేతుల మీదుగా నీరటి సాయిరాజ్ అందుకోవడం అభినందనీయమని అన్నారు. సాయిరాజ్ సామాజిక సేవ చేస్తూ దళితులకు గవర్నమెంట్ నుండి అందవలసిన పథకాలను అందరికీ అందేలా తన వంతు కృషి చేసేవాడు అని తెలిపారు ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయ సాధనలో ముందుకు సాగాలని ఆయన కోరారు అనంతరం లలితరత్న అవార్డు గ్రహీత సాయిరాజ్ మాట్లాడుతూ తన తండ్రి గారైన స్వర్గీయ మీరు సుదర్శన్ దళితుల అభ్యున్నతికి పాటు పడ్డారని గుర్తు చేసుకుంటూ తేజమై మన కుల సంక్షేమ సంఘానికి వేసిన బీజాన్ని గుర్తు చేసుకున్నారు తాను కూడా తండ్రి బాటలో కొనసాగుతూ తండ్రి ఆశయాన్ని నెరవేర్చడానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో కోశాధికారి పప్పుల గోవర్ధన్, సిహెచ్ కొమ్మలు కొండ్ర నర్సింగ్ రావు తండ మల్ల వేణు, కాందారి రాజమౌళి, ఒగ్గుల భద్రయ్య, బండి రామచందర్, పరిటాల శేఖర్, బత్తుల సమ్మయ్య, గదేం వెంకటస్వామి, మద్దెల కార్తీక్, బరాబరీ శ్రీకాంత్, మర్యాల ప్రవీణ్ పార్లపల్లి రాజేష్, బాదాం కుమారస్వామి, బండారి నర్సింగరావు, బొబ్బిలి రాజేందర్, జనపట్ల యాదగిరి, బోయిన వెంకట్రావు, చలమల్ల రాజ్ కుమార్, గొర్రె ఈశ్వర్ లు తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments