అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం.

వలస శంకర్ గౌడ్ జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు 

అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం.

వనపర్తి,ఏప్రిల్13(తెలంగాణ ముచ్చట్లు):

భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ నిర్వహించారు.ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ..రక్తదాతలు ప్రాణదాతలు అని పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదానం చేయడం ఎంతో గొప్ప సేవ అని, ఇది ఒకరి ప్రాణాన్ని కాపాడటంతో సమానం అని తెలిపారు.అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని చెప్పారు.ఈ శిబిరంలో బండారు శ్రీనివాస్ 19వ సారి రక్తదానం చేయడం విశేషం కాగా, రమేష్, వెంకటేష్ లను శంకర్ గౌడ్ అభినందించారు.కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి ప్రొఫెసర్ అరుణకుమారి, సీనియర్ రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్, నర్సింగ్ సూపరింటెండెంట్ అవెంజలిన్, ఉద్యోగులు సంతోష్, లక్ష్మీ, పద్మ, సులోచన (గ్రేడ్-2 నర్సింగ్ సూపరింటెండెంట్) తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .