మార్కుల నిరుత్సాహంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన విద్యార్థి

మార్కుల నిరుత్సాహంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన విద్యార్థి

_ఏఎస్‌రావు నగర్ నుంచి కాచిగూడ వరకు ట్రేస్ 

– మిస్సింగ్ కేసు నమోదు

జవహర్ నగర్, ఏప్రిల్ 13 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్ జై జవాన్ కాలనీకి చెందిన చల్ల బాలాజీ (17) అనే ఇంటర్మీడియట్ విద్యార్థి ఇంటి నుండి వెళ్లిపోయిన ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.పోలీసులు మరియు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 12 సాయంత్రం 7 గంటల సమయంలో బాలాజీ ఎవరికి చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయాడు. అనంతరం రాత్రి 8 గంటల సమయంలో డా .ఏ ఎస్‌ రావు నగర్ బస్ స్టాప్ వద్ద అతను కనిపించినట్లు పొరుగువారు తెలిపారు.ఇంటర్మీడియట్ పరీక్షల్లో 400కు పైగా మార్కులు వస్తాయని ఆశించిన బాలాజీకి సుమారు 300 మార్కులు రావడంతో తీవ్ర నిరుత్సాహానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తల్లి చెల్లా సుబ్బలక్ష్మి పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, ఏప్రిల్ 13 ఉదయం 8 గంటలకు 7383680566 నంబర్ నుండి తన తల్లి కాల్ చేసి ఇంటికి రావాలని చెప్పినప్పటికీ  బాలాజీ తిరస్కరించి కాల్ కట్ చేసినట్లు సమాచారం. తిరిగి సంప్రదించగా తాను కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నట్లు తెలిసింది.తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలాజీ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.సమాచారం తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలి.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .