మహా మాల మిత్ర సంఘానికి కొత్త కార్యవర్గం ఎన్నిక
_2026–2028 కాలానికి ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులు
కాప్రా, ఏప్రిల్ 01 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మీర్పేట్ హెచ్.పీ కాలనీ డివిజన్ పరిధిలో మహా మాల మిత్ర సంఘం సర్వసభ్య సమావేశం ఇటీవల నిర్వహించబడింది. ఈ సమావేశంలో సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని, సంఘ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా 2026–2028 కాలానికి కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొత్తపల్లి నరేందర్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా సూర్య ప్రకాశ్ బి., కోశాధికారిగా జగదీశ్వర్ రావు ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షులుగా మలయాద్రి, బాల భాస్కర్ ఆర్., ఎస్. బాలరాజ్ ఎంపిక కాగా, సహ కార్యదర్శులుగా ఏ. సత్యమూర్తి, కె. ప్రేమ్ సాగర్, ఆర్. ఉదయ్ కుమార్ కిరణ్ బాధ్యతలు స్వీకరించారు.ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ధరా రవి, జె. అప్పా రావు, జి. మధు గోపీ నియమితులయ్యారు.సాంస్కృతిక కార్యదర్శులుగా బి. కాంతారావు, ఎ. మురళి ఎంపికయ్యారు.సలహా కమిటీగా బి. దేవరాజ్, ఏ. సుధాకర్, బాల నర్సయ్య, రాములు, బండి లక్ష్మణ్, శ్రీనివాస్, బాలయ్యలను నియమించారు.సమావేశంలో కొత్త కార్యవర్గం సంఘ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని సభ్యులకు హామీ ఇచ్చారు.


Comments