33 ఫీట్ల రోడ్డును సర్వే చేసి హద్దులు సూచించాలి.

33 ఫీట్ల రోడ్డును సర్వే చేసి హద్దులు సూచించాలి.

హాసన్ పర్తి,ఏప్రిల్ 01(తెలంగాణ ముచ్చట్లు):

హసన్ పర్తి మండలం వంగపహాడ్ గ్రామం నుండి దామెర మండలం వెంకటాపురం గ్రామాల పూర్వకాలంలో ఉన్న 33 ఫీట్ల రోడ్డును సర్వే చేసి హద్దులు సూచించాలని ఆయా గ్రామాల రైతులు హసన్ పర్తి మండల తహసిల్దార్ పూజారి కిరణ్ కుమార్ కు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు డాక్టర్ బండి రజనీ కుమార్ తో కలిసి వినతి పత్రం అందజేశారు. వంగపహాడ్ గ్రామ శివారులో గల సర్వేనెంబర్ 324 నుండి దామెర మండలం వెంకటాపురం గ్రామాల శివారు సరిహద్దుల వరకు పూర్వకాలంలో నక్షలో ఉన్న 33 ఫీట్ల రోడ్ ప్రస్తుతం ఆక్రమణకు  గురైందని వెంటనే దీనిపై సర్వే చేసి హద్దులు సూచించి రోడ్డును పునరుద్ధరించాలని ఆయా గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో రైతులు మండలానికి చేరుకొని తాహ సిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మార్వో సంబంధిత రెవెన్యూ ఇన్స్పెక్టర్ కి వెంటనే సర్వే చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జట్టి రవీందర్,రాజగోపాల్ రెడ్డి,శంకర్ రెడ్డి,చేరాలు, కుమార్,సారయ్య,రాజ్ కుమార్,విక్రమ్,బిక్షపతి, రాజు,సూరయ్య,స్వామి,రవి,బిఆర్ఎస్వి కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జ్ డాక్టర్ జట్టి రాజేందర్,ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .