జడ్పీహెచ్‌ఎస్‌లో బయోగ్యాస్, ఆర్వో ప్లాంట్ల ప్రారంభం

జడ్పీహెచ్‌ఎస్‌లో బయోగ్యాస్, ఆర్వో ప్లాంట్ల ప్రారంభం

_వోయిత్ టర్బో సిఎస్ఆర్ నిధులతో రూ.5 లక్షల అభివృద్ధి 

– ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

మల్లాపూర్, ఏప్రిల్ 1 (తెలంగాణ ముచ్చట్లు):

నాచారం ఇండస్ట్రీ పరిధిలోని ప్రముఖ సంస్థ వోయిత్ టర్బో ప్రైవేట్ లిమిటెడ్ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) నిధుల ద్వారా మల్లాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంట్, ఆర్వో వాటర్ ప్లాంట్‌ను స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు వల్ల మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన వంట గ్యాస్ ఖర్చు తగ్గుతుందని తెలిపారు. అలాగే విద్యార్థుల్లో పునరుత్పాదక ఇంధనంపై అవగాహన పెంపొందుతుందని అన్నారు.
ఇకపోతే, లైబ్రరీ అభివృద్ధికి అవసరమైన అల్మారాలు, కుర్చీలు కూడా సంస్థ అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత, ఉపాధ్యాయులు, వోయిత్ టర్బో సంస్థ ప్రతినిధులు ఈశ్వర్ ప్రసాద్ (వైస్ ప్రెసిడెంట్), మోహనరెడ్డి, రాజశేఖర్ రెడ్డి (జనరల్ మేనేజర్లు), ఇంద్రజ, మహేష్, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక నాయకులు తండా వాసుగౌడ్, ఫైళ్ల ప్రవీణ్ కుమార్IMG-20260401-WA0097, ధర్మారెడ్డి, కాసం రాజిరెడ్డి, దుల్మిట్టా దయాకర్ రెడ్డి, మెండ రఘువరన్, ప్రమోద్ తదితరులు హాజరయ్యారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .