జిల్లా కార్యదర్శి రమేష్ ముదిరాజును కలిసిన జంగం శివ

జిల్లా కార్యదర్శి రమేష్ ముదిరాజును కలిసిన జంగం శివ

పెద్దమందడి,మార్చి30(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ ముదిరాజును పెద్దమందడి కాంగ్రెస్ పార్టీ నాయకుడు జంగం శివ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం  పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో మండల కమిటీ ఏర్పాటు కోసం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రమేష్ ముదిరాజును ఈ సందర్భంగా జంగం శివ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మండల స్థాయిలో పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, భవిష్యత్ రాజకీయ కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిసింది.మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత విస్తరించేందుకు కృషి చేయాలని, ప్రతి కార్యకర్త చురుకుగా పనిచేయాలని రమేష్ ముదిరాజు సూచించారు.  జంగం శివ మాట్లాడుతూ.. పెద్దమందడి మండలంలో పార్టీకి మంచి ఆదరణ ఉందని, నాయకత్వం మార్గదర్శకత్వంలో పార్టీని మరింత బలపరుస్తామని తెలిపారు. ఈ సమావేశం ద్వారా మండల కమిటీ ఏర్పాటు దిశగా పార్టీకి కొత్త ఊపు లభించిందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .