అంగన్వాడి కేంద్రంలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి

అంగన్వాడి కేంద్రంలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి

*అంగన్వాడి కేంద్రం కి విద్యుత్ సరఫరా*

*పరిసరాలు పరిశుభ్రతగా ఉండాలి*

*మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణా*

ఖమ్మం బ్యూరో,మార్చి 17(తెలంగాణ ముచ్చట్లు)

వైరా మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో విద్యుత్ మీటర్ ను  మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ  మంగళవారం  వార్డు కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి కి విద్యుత్ శాఖ డీఈ రమేష్ తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణా మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రం అభివృద్ధికి కౌన్సిలర్ వరలక్ష్మి కృషి చేస్తున్నారు. ఇటీవల ప్రజా పాలన ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా వార్డులో  పర్యటించిన జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ దృష్టికి కౌన్సిలర్ వరలక్ష్మి అంగన్వాడి కేంద్ర సమస్యలను వివరించారు. అందులో భాగంగా ఈరోజు అధికారులు అంగన్వాడి కేంద్రానికి కావలసిన విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లకు సంబంధించిన వస్తువులను తీసుకురావడం జరిగిందని ఆమె అన్నారు, అంగన్వాడి కేంద్రం పావురంలో శుభ్రత అవసరమని పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చైర్ పర్సన్ చంద్రకళ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మెడికల్ అండ్ హెల్త్ చైర్మన్ డాక్టర్ కాపా మురళీకృష్ణా,  ఉండ్రు శ్యామ్ బాబు ,మాజీ కౌన్సిలర్ గూగులోత్ లక్ష్మీబాయి, పొదిలి హరినాథ్ తేజ వత్ నాగేశ్వరావు, గుగులోత్ విజయ్, తాడి రాజు, పృద్వి, లైన్ ఇన్స్పెక్టర్ జార్జి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .