అభిరుచులకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోండి కలెక్టర్ మను చౌదరి

అభిరుచులకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోండి కలెక్టర్ మను చౌదరి

మేడ్చల్–మల్కాజిగిరి, మార్చి 25 (తెలంగాణ ముచ్చట్లు):

విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా తమ అభిరుచులకు అనుగుణంగా అంశాలను ఎంపిక చేసుకుని వాటిలో నైపుణ్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి సూచించారు. తమ ప్రతిభను వెబ్‌సైట్ల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసుకునేలా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు.బుధవారం కీసర మండలం నాగారంలోని మేడ్చల్ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ (బాలికలు) స్కూల్ మరియు జూనియర్ కాలేజీని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం సమయానికి పౌష్టికాహారం అందించాలని సూచించారు. వసతి గృహంలో బోధన పరిస్థితులపై ప్రిన్సిపల్‌ను అడిగి తెలుసుకున్నారు. చదువుతో పాటు క్రీడలు, గేమ్స్ మరియు ఇతర అభిరుచులలో కూడా ప్రతిభ కనబరచాలని తెలిపారు. ఇందుకు అవసరమైన శిక్షణను ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, బిడియాన్ని వదిలి తమకు తెలిసిన విషయాలను నలుగురిలో చెప్పగలగాలని సూచించారు. మారుతున్న టెక్నాలజీని వినియోగిస్తూ స్మార్ట్ వర్క్ చేయడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవాలని చెప్పారు.ప్రస్తుతం చాట్ జిపిటి, జెమిని, పెర్ప్లెక్సిటీ వంటి ఏఐ టూల్స్ వినియోగం పెరుగుతోందని, వీటి ద్వారా పెయింటింగ్, వెబ్ డిజైనింగ్, ప్రోగ్రామింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ వంటి రంగాల్లో అవకాశాలు విస్తరించాయని తెలిపారు.మంచి అలవాట్లు అలవరచుకోవాలని, సబ్జెక్ట్‌పై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. సబ్జెక్ట్ అంటే కేవలం అకాడమిక్స్ మాత్రమే కాకుండా ప్రపంచ పరిణామాలపై అవగాహన ఉండాలని చెప్పారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం ద్వారా స్టేజ్ ఫియర్‌ను అధిగమించవచ్చన్నారు.
విద్యార్థినులతో భోజనం చేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఫుట్‌బాల్, చెస్ వంటి ఆట వస్తువులు కావాలని కోరగా, అవసరమైనవి అందిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని స్కూల్ ప్రిన్సిపల్‌కు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధికారి కాంతమ్మకీసర ఎంఆర్ఓ యాదగిరి రెడ్డి, ప్రిన్సిపల్ స్వప్న, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.IMG-20260325-WA0128

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .