ఈనెల 30వ తేదీన అసెంబ్లీని ముట్టడిని విజయవంతం చేయండి.

తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు రేణుకుంట్ల దుర్గాప్రసాద్ మాదిగ.

ఈనెల 30వ తేదీన అసెంబ్లీని ముట్టడిని విజయవంతం చేయండి.

హాసన్ పర్తి,మార్చ్ 26(తెలంగాణ ముచ్చట్లు):

65 డివిజన్ ఎల్లాపూర్ గ్రామంలో గల అంబేద్కర్ సెంటర్ సమావేశం లో ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర    అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్  రాష్ట్ర కమిటీ తీర్మానం మేరకు అసెంబ్లీ ముట్టడికి తీర్మానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా రేణుకుంట్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల హక్కులకై పోరాటం చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో పాటు ఉద్యమకారులకు ఇప్పటివరకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని కమిటీ వేస్తానని చెప్పి మూడు సంవత్సరాలు కావస్తున్నా కమిటీ వేయడం లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు స్వచ్ఛందంగా అసెంబ్లీ ముట్టడి ఈనెల 30 వ తేదీన  పిలుపునివ్వడం జరిగిందని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు పార్టీలకుఅతీతంగా సంఘాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ప్రతి ఒక్క ఉద్యమకారులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచారు.ఈ కార్యక్రమంలో దేవన బొయిన కుమారస్వామి,పాడి రామకృష్ణారెడ్డి,వెల్ సోజు రాజయ్య,రాజన్న,గోలి విద్యాసాగర్ రెడ్డి,ఎండి రహీం పాషా,వెలిసొజు రమణాచారి,సతీష్,గోపనబోయిన రవీందర్,ఎర్ర శ్యాంసుందర్,తిరుపతి రెడ్డి,వెలిసొజు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
చెరువులు, వాగులు, నాలాల్లో నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించాలి ఇబ్బందులు ఎదురయ్యే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలి హన్మకొండ, సెప్టెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):  జిల్లాలో భారీ వర్షాలు...
నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్ష.
బొల్లోనిపల్లి వంతెన వద్ద నీటి ఉధృతి.. వెంటనే స్పందించిన ఎస్సై.
కడియం అభివృద్ధిపై బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్.
పుట్టలమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ ట్రాలీ సేవలు.
గంగమ్మ ఒడిలోకి గణనాథులు.
కరీంనగర్‌లో ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం.