ప్రకృతిని ప్రేమించడం ఒక కళ.
పలుస శంకర్ గౌడ్ జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు .
వనపర్తి,ఆగస్టు05( తెలంగాణ ముచ్చట్లు):
కొంచెం అభిరుచి, ఇంకొంచెం ఆలోచన, మరికొంత ఓపిక ఉంటే ఇంటిని నందనవనంలా తీర్చిదిద్దుకోవచ్చని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు.బుధవారం పట్టణంలోని మరికుంటలో తమ ఇంటిపై మిద్దె తోటను పెంచుతున్న జైని శ్రీనివాసులు, జయలక్ష్మి దంపతులను సాహితీ కళా వేదిక ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రకృతి ప్రతి జీవరాశి మనుగడకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. ప్రకృతిని ప్రేమించడం, కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని కోరారు.కరోనా మహమ్మారి మానవ జీవితంలో అనేక మార్పులకు కారణమైందని, ప్రజల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిందని తెలిపారు. తమకు అందుబాటులో ఉన్న స్థలంలోనే ఆకుకూరలు, కూరగాయలు పండించుకోవడంతో పాటు వివిధ రకాల ఔషధ మొక్కలు, పండ్ల చెట్లను పెంచుకోవడం మంచి అలవాటుగా మారిందన్నారు.ఈ క్రమంలో శ్రీనివాసులు ,జయలక్ష్మి దంపతులు తమ మిద్దె తోటలో దాదాపు 200 రకాల మొక్కలను పెంచుతూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడమే కాకుండా, ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని శంకర్ గౌడ్ ప్రశంసించారు.పర్యావరణ ప్రేమికులైన ఈ దంపతులను సాహితీ కళా వేదిక సభ్యులు శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆర్‌డీఎస్ సంస్థ నిర్వాహకురాలు చిన్నమ్మ థామస్, బైరోజు చంద్రశేఖర్, దేశి రాములు యాదవ్, బండారు శ్రీనివాస్, రాంరెడ్డి, జయంత్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఎడ్విన్, భరత్ తదితరులు పాల్గొన్నారు.


Comments