రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును ఖండిస్తూ పెద్దమందడిలో కాంగ్రెస్ నిరసన .

రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును ఖండిస్తూ పెద్దమందడిలో కాంగ్రెస్ నిరసన .

పెద్దమందడి,జులై24(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో విద్యార్థులు చేపడుతున్న నిరసనలకు సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా పెద్దమందడి మండల కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.నిరసనలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు బీజేపీ డౌన్ డౌన్    అంటూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలలని నినాదాలు చేశారు. విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకుడిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. అలాగే, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News