చేనేతకు మరో బలం.. బండారి సదానందంకు ఘన సన్మానం.
రాష్ట్ర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అభినందన సభ.
హుజూరాబాద్:జులై 24(తెలంగాణ ముచ్చట్లు ):
జిల్లా చేనేత సెల్ అధ్యక్షుడిగా హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన బండారి సదానందం నియమితులైన సందర్భంగా రాష్ట్ర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో హుజూరాబాద్ చేనేత సహకార సంఘం ఆవరణలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్ బాబు హాజరై బండారి సదానందంను శాలువాతో సత్కరించి అభినందించారు. స్థానిక చేనేత సహకార సంఘం అధ్యక్షుడు ఎలిగేటి ఉపేందర్, రాష్ట్ర పద్మశాలి సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగెం సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని, కౌన్సిలర్లు సొల్లు సునీత బాబు, సంద మల్లబాబు, కోయల్‌కార్ బాలాజీ, మాజీ సర్పంచ్ కొండా గణేష్, రాష్ట్ర చేనేత సెల్ కార్యదర్శి కూరపాటి రామచంద్రము, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాజీపేట శ్రీనివాస్, బీసీ జేఏసీ నాయకులు ఇప్పకాయల సాగర్, సంగెం శ్రీనివాస్ (మెడికల్), సంగెం శ్రీనివాస్ (చిక్స్), మంచికట్ల కమలాకర్, గుండేటి దేవయ్య, మార్తా రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమం, పద్మశాలి సామాజిక వర్గ అభివృద్ధి కోసం బండారి సదానందం సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఆయన నియామకం చేనేత కార్మికులకు మరింత అండగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పద్మశాలి సంఘం నాయ
కులు, చేనేత కార్మికులు, మహిళా నేతకార్మికులు పాల్గొని బండారి సదానందంకు శుభాకాంక్షలు తెలియజేశారు.


Comments