కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు కల్పించాలని కాంగ్రెస్ అభిమానుల విజ్ఞప్తి.

కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు కల్పించాలని కాంగ్రెస్ అభిమానుల విజ్ఞప్తి.

కొత్తకోట,జూలై11(తెలంగాణ ముచ్చట్లు):

కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు, పదవులు కల్పించాలని పార్టీ అభిమానులు, కార్యకర్తలు కోరుతున్నారు. పార్టీ జెండాను భుజాన వేసుకుని రాత్రింబవళ్లు శ్రమించి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కృషి చేసిన రైతు నాయకుడు వేముల శ్రీనుకు పదవి దక్కకపోవడంపై కొత్తకోట మండలంలోని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కష్టపడిన వారికి ప్రాధాన్యం లభిస్తుందని ఆశించినా, చివరి నిమిషంలో ఇతర పార్టీల నుంచి చేరిన వారికి కీలక పదవులు ఇవ్వడం వల్ల నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తల్లో నిరాశ పెరుగుతోందని వారు పేర్కొన్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించిన వారికి తగిన గుర్తింపు ఇవ్వకపోతే క్షేత్రస్థాయిలో కార్యకర్తల ఉత్సాహం దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు.రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలకు గౌరవం, బాధ్యతలు అప్పగించి పార్టీని మరింత బలోపేతం చేయాలని కాంగ్రెస్ పార్టీ అభిమానులు విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్య ప్రసన్న జన్మదిన వేడుకలు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్య ప్రసన్న జన్మదిన వేడుకలు.
హుజురాబాద్, జూలై 11(తెలంగాణ ముచ్చట్లు ): హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర...
భీమదేవరపల్లి ప్రభుత్వ పాఠశాలకు రూ.50 వేల విలువైన వాటర్ కూలర్ విరాళం.
ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియలో పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకులు.
ఉమ్మడి జిల్లా స్థాయి స్మారక కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం.
హుజురాబాద్‌లో పెట్రోల్ బంక్ వద్ద అగ్నిప్రమాదం.
కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు కల్పించాలని కాంగ్రెస్ అభిమానుల విజ్ఞప్తి.
ఘనంగా చిల్డ్రన్స్ పార్లమెంట్ వార్షిక దినోత్సవం.