అల్వాల గ్రామంలో ఎస్‌ఐఆర్ ఓటర్ల నమోదు కార్యక్రమం – ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి.

అల్వాల గ్రామంలో ఎస్‌ఐఆర్ ఓటర్ల నమోదు కార్యక్రమం – ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి.

పెద్దమందడి,జూలై11(తెలంగాణ ముచ్చట్లు):

భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పెద్దమందడి మండలం అల్వాల గ్రామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఓటర్ల నమోదు, ధృవీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.ఈ కార్యక్రమంలో బీఎల్‌ఓ జి. సుదర్శన్ రెడ్డి, బీఎల్‌ఓ రమాదేవి, పంచాయతీ కార్యదర్శి శోభారాణి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కొండారెడ్డి, బుక్ కీపర్ కుప్పిరెడ్డి మాధవి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి ఫారాలు నింపించడంతో పాటు అవసరమైన సూచనలు అందిస్తున్నారు.అల్వాల గ్రామ ప్రస్తుత ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం 1,040 మంది ఓటర్లు ఉండగా, వారిలో సుమారు  కొంత  మంది మరణించిన, కొందరు పెళ్లిళ్లు చేసుకొని  లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు గుర్తించారు. మిగిలిన 1,000 మంది అర్హులైన ఓటర్లలో ఇప్పటివరకు 450 మంది ఆన్‌లైన్ ద్వారా, 150 మంది ప్రత్యక్షంగా ఫారాలు నింపడంతో, మొత్తం 600 ఫారాలు బీఎల్‌ఓకు తిరిగి అందాయి.మరో రెండు రోజుల్లో మిగిలిన 400 మంది ఓటర్ల ఫారాలను పూర్తి చేయాల్సి ఉన్నందున, గ్రామ ప్రజలందరూ తమకు అందిన ఎస్‌ఐఆర్ ఫారాలను ప్రభుత్వ పాఠశాల వద్దకు తీసుకువచ్చి సక్రమంగా నింపించుకుని వెంటనే బీఎల్‌ఓకు అందజేయాలని బీఎల్‌ఓ  జి. సుదర్శన్ రెడ్డి గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్య ప్రసన్న జన్మదిన వేడుకలు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్య ప్రసన్న జన్మదిన వేడుకలు.
హుజురాబాద్, జూలై 11(తెలంగాణ ముచ్చట్లు ): హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర...
భీమదేవరపల్లి ప్రభుత్వ పాఠశాలకు రూ.50 వేల విలువైన వాటర్ కూలర్ విరాళం.
ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియలో పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకులు.
ఉమ్మడి జిల్లా స్థాయి స్మారక కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం.
హుజురాబాద్‌లో పెట్రోల్ బంక్ వద్ద అగ్నిప్రమాదం.
కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు కల్పించాలని కాంగ్రెస్ అభిమానుల విజ్ఞప్తి.
ఘనంగా చిల్డ్రన్స్ పార్లమెంట్ వార్షిక దినోత్సవం.