24వ వార్డులో ఎస్‌ఐఆర్ ఫారమ్‌పై ఇంటింటా అవగాహన.

బీజేపీ నేత రాజేష్ ఠాకూర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రచారం.

24వ వార్డులో ఎస్‌ఐఆర్ ఫారమ్‌పై ఇంటింటా అవగాహన.

జమ్మికుంట టౌన్ జూలై 08 (తెలంగాణ ముచ్చట్లు): 

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా 24వ వార్డులోని 175వ బూత్ పరిధిలో బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యుడు రాజేష్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారమ్‌పై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజేష్ ఠాకూర్ ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారమ్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఓటరు తమ వ్యక్తిగత వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని, అవసరమైన పత్రాలను సమర్పించి ఓటరు జాబితాలో పేరు సరిగా నమోదయ్యేలా చూసుకోవాలని సూచించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రతి ఓటరి పాత్ర కీలకమని పేర్కొంటూ, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .