ప్రజల ఇబ్బందులు గుర్తించి తక్షణ చర్యలు.. నీటిని తొలగించిన కౌన్సిలర్.

ప్రజల ఇబ్బందులు గుర్తించి తక్షణ చర్యలు.. నీటిని తొలగించిన కౌన్సిలర్.

జమ్మికుంట టౌన్ జూలై 03 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంటలో కురిసిన భారీ వర్షానికి నాయిని చెరువు కట్టపై వర్షపు నీరు నిలిచిపోవడంతో మోత్కులగూడెం, మాచనపల్లి గ్రామాలకు వెళ్లే రహదారిపై రాకపోకలు తీవ్రంగా అంతరాయం కలిగాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
విషయం తెలుసుకున్న జమ్మికుంట మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్ పొనగంటి విష్ణువర్ధన్ వెంటనే స్పందించి మున్సిపల్ అధికారులు, సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. జేసీబీ సహాయంతో చెరువు కట్టపై నిలిచిన వర్షపు నీటిని తొలగించే చర్యలు చేపట్టారు.
సకాలంలో చేపట్టిన చర్యలతో రహదారిపై నీరు తొలగిపోవడంతో జమ్మికుంట నుంచి మోత్కులగూడెం, మాచనపల్లి గ్రామాలకు వెళ్లే ప్రజల రాకపోకలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించిన కౌన్సిలర్, మున్సిపల్ సిబ్బందికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.IMG-20260703-WA0024

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .