ఓటర్ల జాబితా సవరణను విజయవంతం చేయాలి.

సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ .

ఓటర్ల జాబితా సవరణను విజయవంతం చేయాలి.

పెద్దమందడి,జూన్26(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం మణిగిల్ల  గ్రామంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల పేర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియను సక్రమంగా పూర్తి చేయాలని సూచించారు.నకిలీ, ద్వంద్వ ఓట్ల తొలగింపుతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం కొనసాగనున్నందున, ఇంటి వద్దకు వచ్చే అధికారులకు అవసరమైన వివరాలు అందించి, తమ ఓటరు వివరాలను పరిశీలించి సరిచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, గ్రామ స్థాయి ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .