డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం.

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి : సీఐ పులి రమేష్.

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం.

IMG-20260625-WA0047

ఎల్కతుర్తి, జూన్ 25 (తెలంగాణ ముచ్చట్లు):

యువతను డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలబారిన పడకుండా కాపాడేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ అన్నారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం డ్రగ్స్ నిర్మూలనపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మునిగడప లావణ్య శేషు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఐ పులి రమేష్ మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా కుటుంబాలను కూడా విచ్ఛిన్నం చేస్తోందన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ విక్రయాలు, వినియోగంపై సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎస్సై నర్శింహరావు మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, స్నేహితుల వర్గం, రోజువారీ అలవాట్లను గమనించాలని సూచించారు. పిల్లలు చెడు వ్యసనాలకు గురికాకుండా కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం డ్రగ్స్ నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు బస్టాండ్ సర్కిల్ ప్రాంతంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొని డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను మత్తు పదార్థాల బారిన పడనివ్వబోమని, వారి భవిష్యత్తు రక్షణకు కట్టుబడి ఉంటామని తల్లిదండ్రుల నుంచి ప్రతిజ్ఞ పత్రాలు స్వీకరించారు. డ్రగ్స్ రహిత ఎల్కతుర్తి నిర్మాణానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పోలీసులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హై స్కూల్ విద్యార్థులు సైతం ఉత్సాహంగా పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక నినాదాలతో అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, విద్యార్థినులు, తల్లిదండ్రులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

మత్తు మహమ్మారిపై ఉక్కుపాదం.. హుజూరాబాద్ ఏసపీ . మత్తు మహమ్మారిపై ఉక్కుపాదం.. హుజూరాబాద్ ఏసపీ .
పూర్తిగా దూరంగా ఉండాలి – సమాచారం అందించిన వారి వివరాలు గోప్యమే హుజూరాబాద్, జూన్ 25(తెలంగాణ ముచ్చట్లు ): సమాజాన్ని మత్తు పదార్థాల రహితంగా తీర్చిదిద్దాలంటే ప్రజల...
హుజురాబాద్‌లో పలు వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం.
జమ్ములమ్మ అమ్మవారి ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.
సొంత గ్రామంలోనే ఓటు హక్కు నమోదు చేసుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి.
పశువుల ఆరోగ్యమే రైతు ఆర్థిక బలం.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం.
జమ్ములమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి.