ఉచిత సివిల్స్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం.

ఉచిత సివిల్స్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం.

హనుమకొండ,జూన్24(తెలంగాణ ముచ్చట్లు): 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని తెలంగాణ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధ్యయన కేంద్రం (స్టడీ సర్కిల్), బంజారాహిల్స్, హైదరాబాద్‌లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CSAT) – 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ మరియు తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఉమ్మడి వరంగల్ జిల్లా శాఖ చైర్‌పర్సన్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కలెక్టరేట్ లో బుధవారం కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ, తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు దివ్యాంగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై, కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించని అభ్యర్థులు మాత్రమే అర్హులని తెలిపారు.

అభ్యర్థులు 19 జూన్ 2026 నుంచి 12 జూలై 2026 వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, ఇందుకోసం http://tsstudycircle.co.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 19 జూలై 2026న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత వసతి, భోజన సదుపాయాలతో కూడిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ హనుమకొండ జిల్లా అధికారి బి. నిర్మల, తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఉమ్మడి వరంగల్ జిల్లా గౌరవ సంచాలకులు డా. కె. జగన్ మోహన్, పర్యాటక అభివృద్ధి శాఖ జిల్లా అధికారి ఎం. శివాజీ, కనకరాజు, కవిత తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .