వర్షాకాల సన్నద్ధతపై మున్సిపల్ చైర్మన్ ప్రత్యేక దృష్టి..

వర్షాకాల సన్నద్ధతపై మున్సిపల్ చైర్మన్ ప్రత్యేక దృష్టి..

* హౌసింగ్ బోర్డ్ కాలనీ, అంబేద్కర్ కాలనీ, నాయిని చెరువు పరిసరాల పరిశీలన

* ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చైర్మన్ హామీ

జమ్మికుంట టౌన్ జూన్ 24 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట పట్టణంలో ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరద నీటి సమస్యలపై అప్రమత్తమైన మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) 6, 22, 30వ వార్డులను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ, అంబేద్కర్ కాలనీ, నాయిని చెరువు పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, వర్షాకాలంలో వరద నీటి సమస్యల వల్ల పట్టణ ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ పాలకవర్గం ప్రధాన లక్ష్యమని, పట్టణ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు.

వర్షాకాలంలో ఎక్కడైనా నీటిమునిగే పరిస్థితులు, డ్రైనేజీ సమస్యలు లేదా ఇతర అత్యవసర ఇబ్బందులు తలెత్తినట్లయితే మున్సిపాలిటీ టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పొనగంటి రాము, చందా రాజు, శ్రీపతి నరేష్, మంద రాజేష్, బోళ్ల సదానందం తదితరులు పాల్గొన్నారు.IMG-20260624-WA0085

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .