ప్రజా రక్షణలో మరోసారి సత్తా చాటిన ఎల్కతుర్తి పోలీసులు.

ప్రజా రక్షణలో మరోసారి సత్తా చాటిన ఎల్కతుర్తి పోలీసులు.

 –97 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్

–మాదకద్రవ్యాలపై ఎల్కతుర్తి పోలీసుల  ఉక్కుపాదం

ఎల్కతుర్తి, జూన్ 23 (తెలంగాణ ముచ్చట్లు):

 ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ఎల్కతుర్తి పోలీసులు మరోసారి తమ సమర్థతను చాటుకున్నారు. గంజాయితో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 97 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
సీఐ పులి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం సాయంత్రం సూరారం గ్రామ శివారులోని రిలయన్స్ గ్యాస్ సమీపంలో దండేపల్లి గ్రామానికి చెందిన చిలుకా సిద్దు (20) అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో ఎల్కతుర్తి ఎస్సై నరసింహారావు తన సిబ్బందితో కలిసి అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, అతని వద్ద 97 గ్రాముల గంజాయి లభించింది.
విచారణలో మహారాష్ట్ర రాష్ట్రంలోని బళ్లార్షా ప్రాంతంలో గంజాయిని కొనుగోలు చేసి తన ఇంటికి తీసుకెళ్తుండగా పట్టుబడినట్లు వెల్లడైంది. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు సీఐ తెలిపారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.IMG-20260623-WA0057 ఈ కార్యక్రమంలో ఎస్సై నరసింహారావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .