యోగతో ఆరోగ్యకర జీవనం సాధ్యం.

పలుస శంకర్ గౌడ్ జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు .

యోగతో ఆరోగ్యకర జీవనం సాధ్యం.

వనపర్తి,జూన్21(తెలంగాణ ముచ్చట్లు):

యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరమని, ఆరోగ్యవంతమైన జీవనానికి యోగా ఉత్తమ మార్గమని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ పేర్కొన్నారు.అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా శరీరం, మనసు, ఆత్మల సమన్వయానికి దోహదపడే జీవన విధానమని అన్నారు.యోగా సాధన ద్వారా రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు తగ్గుతాయని తెలిపారు. ప్రాణాయామం, ధ్యానం ద్వారా ఏకాగ్రత పెరిగి మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు.విద్యార్థులు, యువత, మహిళలు, వృద్ధులు ప్రతిరోజూ కొంత సమయం యోగా సాధనకు కేటాయించాలని సూచించారు. యోగా మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిందని, ప్రపంచ దేశాలు యోగాను ఆదరించడం భారతీయులకు గర్వకారణమని అన్నారు.ఈ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని పలుస శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .