ముడిసరుకు ధరల భారం.. జమ్మికుంటలో ఫోటోగ్రాఫర్ల బంద్ జయప్రదం"

నేటి నుంచి కొత్త ధరల అమలు..

ముడిసరుకు ధరల భారం.. జమ్మికుంటలో ఫోటోగ్రాఫర్ల బంద్ జయప్రదం

జమ్మికుంట టౌన్ జూన్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మండలంలోని ఫోటో స్టూడియోల యజమానులు చేపట్టిన బంద్ విజయవంతంగా ముగిసిందని ఫోటోగ్రాఫర్స్ యూనియన్ మండల అధ్యక్షులు ఎండి. ముస్తఫా తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన స్టూడియో యజమానులు, ఫోటోగ్రాఫర్లు మరియు సంఘ సభ్యులందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్కెట్‌లో ముడిసరుకుల ధరలు, ప్రింటింగ్ వ్యయాలు, స్టూడియోలకు అవసరమైన పరికరాలు మరియు ఇతర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో సేవల నిర్వహణ భారంగా మారిందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తప్పనిసరి పరిస్థితుల్లో ఫోటో స్టూడియో సేవల ధరలను స్వల్పంగా సవరించినట్లు వెల్లడించారు.

సవరించిన నూతన ధరలు జూన్ 18 నుంచి జమ్మికుంట మండలంలోని అన్ని ఫోటో స్టూడియోలలో అమలులోకి వస్తాయని తెలిపారు. వినియోగదారులు ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు చిన్నింటి నాగేందర్, మండల అధ్యక్షులు ఎండి. ముస్తఫా, ఉపాధ్యక్షులు ఎండి. అజార్, ప్రధాన కార్యదర్శి దొడ్డె ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు పొనగంటి విజయ్‌రాజుతో పాటు ఫోటోగ్రాఫర్లు రత్నకుమార్, రాంబాబు, రవి, సునీల్, ఉపేందర్, తోట రాజేందర్, గౌతం, నాని, శ్రీను, ప్రవీణ్, అంబాల హరీష్, సురోజు శ్రీనాథ్, మడుపు సంతోష్, జానీ, ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .