భావితరాలకు హరిత వారసత్వమే లక్ష్యం!

ఎమ్మెల్యే రాగమయి.

భావితరాలకు హరిత వారసత్వమే లక్ష్యం!

సత్తుపల్లి, జూన్ 18 (తెలంగాణ ముచ్చట్లు):

భావితరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పిలుపునిచ్చారు. పెనుబల్లి మండలం రామచంద్రపురం గ్రామ పంచాయతీ పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం లంకపల్లి పాఠశాల విద్యార్థినులతో కలిసి మొక్కలు నాటుతూ పచ్చదనం ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో చెట్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షిస్తే హరిత తెలంగాణ లక్ష్యం సాకారమవుతుందని అన్నారు. కార్యక్రమంలో పెనుబల్లి తహసీల్దార్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పంది వెంకటేశ్వరరావు, రామచంద్రపురం సర్పంచ్ ఎస్.కే. రిజ్వానా కరీముల్లా, లంకపల్లి సర్పంచ్ రాజా, అటవీ శాఖ సబ్‌ డీఎఫ్‌వో, ఎఫ్‌ఆర్‌వో మల్లయ్య, ఎఫ్‌డీవో, డీఆర్‌వో, సెక్షన్ అధికారులు, బీట్ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.IMG-20260618-WA0116

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .