లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ.

లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ.

పెద్దమందడి,జూన్13(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి ఆధ్వర్యంలో పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందుతున్న ఆర్థిక సాయం ఎంతో ఊరటనిస్తోందని లబ్ధిదారులు తెలిపారు.అవసరమైన వారికి తక్కువ సమయంలోనే సహాయనిధి మంజూరు కావడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కావలి బాలయ్యకు రూ.1,06,000, పానుగంటి సుజాతకు రూ.48,000, పానుగంటి చిట్టెమ్మకు రూ.11,000 చొప్పున మొత్తం రూ.1,65,000 విలువైన చెక్కులను అందజేశారు.ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు త్వరితగతిన మంజూరు కావడానికి కృషి చేసిన వనపర్తి శాసనసభ్యులు తూడి మెగా రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, పెద్దమందడి–ఖిల్లా ఘనపూర్ మండలాల మార్కెట్ యార్డు ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, గట్టు యాదవ్, పెద్దమందడి సర్పంచ్ గంగా రవి, మద్దిగట్ల సర్పంచ్ రాములు యాదవ్, చిన్న మందడి సర్పంచ్ స్వరూప మాజీ ఎంపీటీసీ ఇందిరా లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచులు సిద్ధయ్య, రమేష్, తిక్కన్న నాయక్, మధిర శ్రీశైలం, సందడి మన్యపు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల గంజాయి స్వాధీనం. కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల గంజాయి స్వాధీనం.
ఖమ్మం బ్యూరో, జూన్ 14(తెలంగాణ ముచ్చట్లు ) ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల ఎండు గంజాయిని పోలీసులు...
రక్తదానం మహాదానం.. వైద్యుల సూచనలతోనే రక్తదానం చేయాలి.
శాలపల్లి గ్రామంలో ప్రైవేట్ పాఠశాల బస్సుల ప్రవేశానికి నిషేధం.
మరణానంతరం కూడా మిత్రుడికి అండగా.. కుటుంబానికి లక్ష రూపాయల సహాయం.
రైతు సమస్యలపై సూరారంలో గర్జించిన రైతాంగం.
పాఠశాల పునఃప్రారంభానికి ముస్తాబు.. క్రీడా మైదానాల అభివృద్ధికి సర్పంచ్ ప్రత్యేక చొరవ.
బొడ్రాయి మహోత్సవానికి మాజీ జెడ్పీటీసీ రాజశేఖర్ రెడ్డి విరాళం.