విద్యాదాతకు విశిష్ట సన్మానం..

డాక్టర్ పులిపాటి ప్రసాద్‌కు ఘన సన్మానం.

విద్యాదాతకు విశిష్ట సన్మానం..

ఖమ్మం బ్యూరో , జూన్ 10(తెలంగాణ ముచ్చట్లు )

విద్యా, సామాజిక, సేవా రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తూ వేలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన ప్రముఖ విద్యావేత్త, పులిపాటి విద్యాసంస్థల అధినేత, ఖమ్మం పౌర సమితి అధ్యక్షులు డాక్టర్ పులిపాటి ప్రసాద్ గారికి ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రెండోసారి నియమితులైన సందర్భంగా పులిపాటి నగర్-2లోని పులిపాటి మినీ ఫంక్షన్ హాల్‌లో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

2008లో భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా వాగ్దేవి విద్యా పురస్కారం అందుకున్న డాక్టర్ పులిపాటి ప్రసాద్, పులిపాటి ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరుపేదలకు విద్య, ఆర్థిక సహాయం, అన్నదాన సేవలు అందిస్తున్నారని పలువురు వక్తలు కొనియాడారు. సమాజంలో ఆపద్బాంధవుడిగా, విద్యాదాతగా ఆయన సాధించిన గుర్తింపు అభినందనీయమన్నారు.

రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమర్నాథ్ లక్ష్మీనారాయణ నాయకత్వంలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తిరిగి బాధ్యతలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రముఖులు, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ పులిపాటి ప్రసాద్ గారిని శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

కార్యక్రమంలో సిద్ధంశెట్టి శ్రీకాంత్, కోదుమూరు భద్రయ్య, కోదుమూరు జగన్నాథం, మాశెట్టి వరప్రసాద్, కొంకిమళ్ల మృత్యుంజయ గుప్తా, పాలవాయి వెంకటేశ్వర్లు, దాస శ్రీనివాసరావు, వజినేపల్లి చంద్రశేఖర్ గుప్తా, తేలుకుంట్ల ఓంకార్, వెల్లంపల్లి వెంకట సుబ్బారావు, విద్యాల విశ్వనాథ్ గుప్తా, కాజా వెంకటేశ్వరరావు, సుగ్గల శ్రీహరి, గోపాలరావు, తాడికొండ అరవింద్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ డాక్టర్ పులిపాటి ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .