స్వర్గం సరోజన–రాజేశ్వరరావు స్మారక క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు.

స్వర్గం సరోజన–రాజేశ్వరరావు స్మారక క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు.

ఉప్పల్, జూన్ 9 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ గ్రామంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మైదానంలో స్వర్గీయ స్వర్గం సరోజన–రాజేశ్వరరావు గార్ల స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ టోర్నమెంట్‌ను స్వర్గం రవి గారు స్పాన్సర్ చేయగా, జిల్లాలోని పలు జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి.
ఉత్కంఠభరితంగా సాగిన పోటీల్లో హుజూరాబాద్ జట్టు విజేతగా నిలిచి తొలి బహుమతి రూ.50,000 అందుకుంది. ఉప్పల్ జట్టు రన్నరప్‌గా నిలిచి రూ.25,000 నగదు బహుమతిని కైవసం చేసుకుంది. విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు.
బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ప్రణవ్ బాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు హాజరై విజేతలను అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించడం యువతలో క్రమశిక్షణ, ఐకమత్య భావాలను పెంపొందిస్తుందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామ నాగరాజు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఝాన్సీ రవీందర్, ఉప సర్పంచ్ సిద్ధార్థ్, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను, స్పాన్సర్‌గా వ్యవహరించిన స్వర్గం రవి గారిని పలువురు అభినందించారు. క్రీడాస్ఫూర్తిని పెంపొందించే ఇటువంటి పోటీలు మరిన్ని నిర్వహించాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News