గ్రామ సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం వీడాలి.

టీఆర్‌పీ జిల్లా యూత్ అధ్యక్షుడు రవికుమార్.

గ్రామ సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం వీడాలి.

మదనాపురం జూన్08(తెలంగాణ ముచ్చట్లు): 

గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో గ్రామపంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షుడు జి. రవికుమార్ ఆరోపించారు.సోమవారం మదనాపురం మండలం తిర్మలాయపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు.గత నెలలో నిర్వహించిన గ్రామసభలో 8వ వార్డులో డ్రైనేజీ, సీసీ రోడ్లు, పారిశుద్ధ్య సమస్యలు, పిచ్చిమొక్కల తొలగింపు, దోమల నివారణ తదితర అంశాలపై అధికారులకు వినతిపత్రం అందజేసినా ఇప్పటివరకు చర్యలు చేపట్టలేదని విమర్శించారు.మురుగునీటి నిల్వలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.గ్రామంలో ఫాగింగ్, బ్లీచింగ్ కార్యక్రమాలు చేపట్టి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే విద్యార్థుల కోసం గ్రంథాలయం, ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోతురాజు రాములు, ఉప సర్పంచ్ రాజు, వార్డు సభ్యులు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .