దళితబంధు రెండో విడత మంజూరు జాప్యంపై ఆగ్రహం.

జమ్మికుంటలో సాధన సమితి మీడియా సమావేశం.

దళితబంధు రెండో విడత మంజూరు జాప్యంపై ఆగ్రహం.

జమ్మికుంట టౌన్ జూన్ 04 (తెలంగాణ ముచ్చట్లు):

దళితబంధు రెండో విడత మంజూరులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ జమ్మికుంట పట్టణంలో గురువారం దళితబంధు సాధన సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం సాధన సమితి నాయకులు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్‌ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన మున్సిపల్ చైర్మన్ వెంటనే స్పందించి సంబంధిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, వారం రోజుల్లో సానుకూల పరిణామాలు ఉంటాయని లబ్ధిదారులకు భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా సాధన సమితి నాయకులు మాట్లాడుతూ, 2025 జనవరి 28న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సుమారు 7 వేల మంది లబ్ధిదారులకు ఎటువంటి విచారణ లేకుండానే నేరుగా బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం మూడు దశల్లో విచారణలు నిర్వహిస్తూ దళితబంధు అమలును క్లిష్టతరం చేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

మిగిలిన 5 వేల కుటుంబాలకు ఎటువంటి అదనపు ఆంక్షలు లేకుండా త్వరితగతిన గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేసి దళితబంధు ప్రయోజనాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక నెలలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.

సాధన సమితి నాయకుడు కొలుగూరి నరేష్ మాట్లాడుతూ, 2025 మే 25 నుంచి నవంబర్ 18 వరకు ఐదు నెలల కాలంలో కేవలం 1,060 మంది లబ్ధిదారులకు మాత్రమే గ్రౌండింగ్ పూర్తైందని, ఇంకా వేలాది కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని పేర్కొన్నారు. మిగిలిన కుటుంబాలకు ప్రక్రియ ప్రారంభించేందుకు ఇంకా ఎంతకాలం పడుతుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే, దళితబంధు రెండో విడత కోసం దాదాపు 22 నెలల పాటు నిరంతర పోరాటం చేసిన 20 నుంచి 25 మంది నాయకులు ఇప్పటికీ లబ్ధి పొందకపోవడం బాధాకరమని అన్నారు. ఉద్యమంలో ముందుండి పోరాడిన వారికి న్యాయం జరగకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని సాధన సమితి నాయకుల దరఖాస్తులను పరిశీలించి వారికి న్యాయం చేయాలని కోరారు. అలాగే సమస్యపై స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్‌కు సాధన సమితి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దళితబంధు సాధన సమితి నాయకులు కొలుగూరి నరేష్, కోడెపాక రక్షిత్, అకినపల్లి జయ,జీడీ అరుణ, పాత రాజేష్, రామంచ శ్రీకాంత్, వంశీ తదితరులు పాల్గొన్నారు.IMG-20260604-WA0050

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .