మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామిని సన్మానించిన వెల్టూర్ కాంగ్రెస్ నాయకులు.

మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామిని సన్మానించిన వెల్టూర్ కాంగ్రెస్ నాయకులు.

పెద్దమందడి,మే28(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన కొమ్ము వెంకటస్వామిని వెల్టూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కొమ్ము వెంకటస్వామి సమర్థవంతంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను మరింత చురుకుగా నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.అనంతరం పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. మండల ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని కొమ్ము వెంకటస్వామి తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.సన్మానించిన వారిలో వెల్టూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బాబు రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ మల్లికార్జున్ ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .