ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమ కారుడికి న్యాయం జరిగే వరకు పోరాటం.

తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు పిడమర్తి .

ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమ కారుడికి న్యాయం జరిగే వరకు పోరాటం.

 ఖమ్మం,మే26(తెలంగాణ ముచ్చట్లు):

ఖమ్మంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఉమ్మడి జిల్లా సమావేశం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి రడం సురేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ పిడమర్తి రవి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, యువత, ప్రజలు క్రియాశీలకంగా పాల్గొని అలుపెరుగని పోరాటం చేయడం వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారుల త్యాగాలకు తగిన గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.

తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయడం కోసం కేకే ఆధ్వర్యంలో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేలా అందరూ కలిసి ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జూన్ 21న హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నామని, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరూ స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కేవీ కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల పోరాట ఫలితంగానే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేశారని అన్నారు. ఆ కృతజ్ఞతతోనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో తెలంగాణ సీనియర్ ఉద్యమకారులు డోకుపర్తి సుబ్బారావు, పగడాల నరేందర్, పొనుగోటి సంపత్, నందిగామ రాజ్‌కుమార్, లింగనబోయిన సతీష్, చీకటి కార్తీక్, పమ్మి రవి, పాలకుర్తి కృష్ణ, బత్తిని మధు గౌడ్, భూక్యా నాగేశ్వరరావు, కోడిరెక్క ఉమాశంకర్, బొబ్బిల్ల భరత్ చంద్ర, దరిపల్లి వీరబాబు, చౌహన్‌తో పాటు 1969 ఉద్యమకారులు ఎండీ ఖాసీం, రమాదేవి, బొడ్డు గ్లోరీ, కొరివి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భూసార పరిరక్షణే ధ్యేయం. భూసార పరిరక్షణే ధ్యేయం.
దమ్మపేట, మే 26 (తెలంగాణ ముచ్చట్లు): భూసార ఆరోగ్య పరిరక్షణతోనే పంట దిగుబడులు పెరుగుతాయని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. దమ్మపేట మండల కేంద్రంలో మంగళవారం...
గ్రామ దీపికల డిమాండ్లు తీర్చాలి.!
రాపాకపల్లిలో ఎమ్మార్పీఎస్ గద్దె నిర్మాణ పనులు ప్రారంభం .
ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమ కారుడికి న్యాయం జరిగే వరకు పోరాటం.
దోపిడి కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్.
మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయం.!
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో రైతులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు.