ఎస్ ఐ ఆర్ అవగాహన సదస్సు .

ఎస్ ఐ ఆర్ అవగాహన సదస్సు .

ఖమ్మం బ్యూరో, మే 24(తెలంగాణ ముచ్చట్లు )

జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాలతో తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25 నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కానుందని ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ఓటును కాపాడుకోవాలని నాగరిక వికాస్ కేంద్ర రాష్ట్ర సమన్వయకర్త మహమ్మద్ జునేద్ పిలుపునిచ్చారు. ఈరోజు స్థానిక జమాతే ఇస్లామి కార్యాలయంలో నాగరికత వికాస్ కేంద్ర ఖమ్మం యూనిట్ అధ్యక్షులు మొహమ్మద్ ముజీబ్ అధ్యక్షతన జరిగిన ఎస్ ఐ ఆర్ అవగాహన సదస్సులు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎస్సై ఆర్ ప్రక్రియలో తమ ఏరియా బిఎల్ఓ తో సంప్రదించి చేసుకొని ఓటు హక్కును కాపాడుకోవాలని కోరారు. మరొక అతిథిగా విచ్చేసిన హైదరాబాద్ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ అబ్దుల్ ఖాలిక్ మాట్లాడుతూ 2002 ఓటర్ లిస్టులో తమ పేరుని గుర్తించి ప్రస్తుత ఓటర్ ఐడి తో బిఎల్ఓ వద్ద ప్రీమ్యాపింగ్ చేసుకొని తమ కుటుంబ సభ్యుల ఓట్లను చేర్చుకోవాలని తెలియజేశారు. ఈ ప్రక్రియ సజావుగా కొనసాగడానికి విద్యావేత్తలు మేధావులు తగిన శ్రద్ధ తీసుకొని ఏ ఒక్క ఓటు డిలీట్ కాకుండా చూసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ ఖాసిం జమాతే ఇస్లామీ హింద్ బాధ్యులు మొహమ్మద్ ఇంతియాజ్, మహమ్మద్ యూసఫ్ షరీఫ్, సమీ, ఇలియాజ్, అబ్దుల్ రజాక్ పట్టణంలోని యువకులు విద్యావంతులు తదితరులు  పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .