మడిపల్లి అగ్నిప్రమాద బాధిత గౌడ కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలి.

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

మడిపల్లి అగ్నిప్రమాద బాధిత గౌడ కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలి.

జమ్మికుంట టౌన్ మే 24 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఈతవనం, తాటివనం పూర్తిగా దగ్ధమై గౌడ కుటుంబాలు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూశాయి. ఈ ఘటనపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు.

అగ్నిప్రమాదంతో జీవనాధారం కోల్పోయిన గౌడ సోదరుల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన ఎమ్మెల్యే, బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన నష్టంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

బాధితులకు వెంటనే నష్టపరిహారం మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే, పరిస్థితిని వివరించారు. అలాగే ఎక్సైజ్ శాఖ అధికారులతో కూడా చర్చించి సంబంధిత శాఖల ద్వారా బాధిత కుటుంబాలకు అత్యవసర సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

గౌడ కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని, బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రస్తుతం గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా, స్థానికులు కూడా బాధిత కుటుంబాలకు తోడుగా నిలుస్తున్నారు.IMG-20260524-WA0131

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .