పేదరికం బలి తీసుకున్న మరో ప్రాణం.

పేదరికం బలి తీసుకున్న మరో ప్రాణం.

ఎల్కతుర్తి, మే 24 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామంలో పేదరికం మరో ప్రాణాన్ని బలి తీసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అంబాల మధు (35) అనే దివ్యాంగుడు ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తాళలేక చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మధు తన భార్య, ఇద్దరు చిన్నపిల్లలు, వృద్ధ తల్లిదండ్రులతో కలిసి అత్యంత పేదరికంలో జీవనం సాగించేవాడు. గ్రామంలోని హైస్కూల్ ఎదుట చిన్న కిరాణ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే నేషనల్ హైవే, రైల్వే విస్తరణ పనుల కారణంగా ఇల్లు స్థలం కోల్పోవడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడినట్లు గ్రామస్థులు తెలిపారు.
ఇక కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు, ఆసుపత్రి ఖర్చులు పెరగడంతో అప్పులు మరింత భారంగా మారాయి. ఈ పరిస్థితులతో తీవ్ర మనస్తాపానికి గురైన మధు వారం రోజుల క్రితం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
మధు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్థులు కలిసి అంత్యక్రియలకు సహాయం అందించి దహన సంస్కారాలు నిర్వహించారు. ప్రస్తుతం కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉందని, ప్రభుత్వం స్పందించి ఆర్థిక సహాయం అందించడంతో పాటు నివాస స్థలం కల్పించి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .