ఉమ్మడి మండలాల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డికి ఘన సన్మానం.

ఉమ్మడి మండలాల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డికి ఘన సన్మానం.

పెద్దమందడి,మే19(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా  పెద్దమందడి–ఖిల్లా ఘనపూర్ మండలాల ఉమ్మడి మార్కెట్ యార్డు వైస్ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన కొత్తకాపు వెంకటేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, పెద్దమందడి మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, మోజర్ల సర్పంచ్ చంద్రశేఖర్ తదితరులు వెంకటేశ్వర్ రెడ్డిని శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. నూతన బాధ్యతల్లో విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ..తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ మార్కెట్ యార్డు అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, మోజర్ల సర్పంచ్ చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .