కార్డన్ సెర్చ్‌లో పోలీసుల సోదాలు.. రికార్డులు లేని వాహనాలు స్వాధీనం

కార్డన్ సెర్చ్‌లో పోలీసుల సోదాలు.. రికార్డులు లేని వాహనాలు స్వాధీనం

జమ్మికుంట టౌన్ మే 20 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట మండల పరిధిలో పోలీసులు చేపట్టిన భారీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో హుజూరాబాద్ రూరల్ ఇన్‌స్పెక్టర్, సైదాపూర్ ఎస్ఐతో పాటు ఎస్ఐలు యూన్స్, రవి తమ సిబ్బందితో కలిసి విలాసాగర్, తనుగుల, గండ్రపల్లి గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

గ్రామాల సరిహద్దులను దిగ్బంధించి ప్రతి ఇంటిని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సోదాల్లో సరైన పత్రాలు, ఆధారాలు లేని ఎనిమిది మోటార్‌సైకిళ్లు, రెండు ఖాళీ ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిబంధనలు ఉల్లంఘించి రికార్డులు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించినట్లు పోలీసులు తెలిపారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసమే ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.

వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ వంటి పత్రాలు వెంట ఉంచుకోవాలని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .