మందలపల్లి కేసీఆర్ కాలనీలో త్రాగునీటి కష్టాలు.

వారం రోజులుగా నీటి కోసం అవస్థలు పడుతున్న కాలనీ వాసులు.

మందలపల్లి కేసీఆర్ కాలనీలో త్రాగునీటి కష్టాలు.

దమ్మపేట, మే 17(తెలంగాణ ముచ్చట్లు): 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలోని డబుల్ బెడ్‌రూమ్ కేసీఆర్ కాలనీలో త్రాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. గత వారం రోజులుగా పంచాయతీ నీటి సరఫరా నిలిచిపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్రాగడానికి, నిత్యావసరాల కోసం నీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.
కాలనీ ప్రజల సమస్య తెలుసుకున్న ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ్ గౌడ్ సొంత ఖర్చులతో వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేశారు. బీజేపీ నాయకుడు తంబళ్ల రవితో కలిసి రాత్రి సమయంలో కాలనీకి చేరుకుని ప్రజలకు త్రాగునీరు అందించారు. దీంతో కాలనీ వాసులు కొంత ఊరట చెందారు. వారం రోజులుగా సమస్య కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వత నీటి సదుపాయం కల్పించాలని, లేకపోతే బిందెలతో రోడ్డెక్కి ఆందోళన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .