ఆకట్టుకున్న మద్దిగట్ల-మోజర్ల పాఠశాల విద్యార్థుల నృత్య ప్రదర్శనలు.

ఆకట్టుకున్న మద్దిగట్ల-మోజర్ల పాఠశాల విద్యార్థుల నృత్య ప్రదర్శనలు.

వనపర్తి,మే16(తెలంగాణ ముచ్చట్లు):

99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో కళలు, హస్తకళలు మరియు సాంస్కృతిక దినోత్సవ కార్యక్రమం శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పెద్దమందడి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల-మోజర్ల విద్యార్థులు బంజారా నృత్యం, తెలంగాణ బోనాల పండుగకు సంబంధించిన నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.కార్యక్రమాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ కీమ్యా నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని ప్రారంభించారు.పెద్దమందడి మండల విద్యాధికారి మంజులత విద్యార్థుల ప్రదర్శనలను తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు.పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు ఎస్ వరప్రసాద్ రావు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థుల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయని తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ పాఠశాల తరఫున తప్పకుండా పాల్గొంటామని పేర్కొన్నారు. కార్యక్రమానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జీసీడీఓ ఇందిర, జిల్లా కోఆర్డినేటర్లు శేఖర్, మహానంది, నారాయణమ్మ, ప్రతాప్ రెడ్డి, జిల్లా పీఆర్టీయూటీఎస్ అధ్యక్షుడు ఎం బౌద్ధ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్ చంద్రశేఖర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పి ప్రసాద్, వ్యాఖ్యాత బైరోజు చంద్రశేఖర్, చిక్కేపల్లి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు శివయ్య, పాఠశాల ఉపాధ్యాయులు పి వెంకటస్వామి, పుల్లయ్య, మధుసూదన్, చిన్నారెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయుడు డి రణదీవ్, అమ్మపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శశివర్ధన్ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా శీలంశెట్టి వీరభద్రం ఏకగ్రీవ ఎన్నిక. మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా శీలంశెట్టి వీరభద్రం ఏకగ్రీవ ఎన్నిక.
ఖమ్మం బ్యూరో, మే 16(తెలంగాణ ముచ్చట్లు ) మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా శీలంశెట్టి వీరభద్రం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతోపాటు సంఘం జిల్లా...
విధుల్లో కఠినత్వం.. క్రీడల్లో స్వర్ణ విజయం : ఏసిపి మాధవి
రెండు వారాలు గడిచినా ధాన్యం డబ్బులు లేవు… ఐకేపీ సెంటర్ నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం.
పల్లెకు వెళ్లొస్తా” అన్న భద్రయ్య.. మృతదేహంగా తిరిగొచ్చాడు.
బైక్ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు.. ఆలస్యంగా ఫిర్యాదు.
సలీం సేవలను కాంగ్రెస్ ఎప్పటికీ మరవదు : తాజుద్దీన్
డీజిల్, పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యుడిపై పెనుభారం : సొల్లు బాబు