పోతిరెడ్డిపేట ఆరోగ్య కేంద్రం భవనాన్ని పరిశీలించిన డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రవణ్ కుమార్.
Views: 6
On
హుజురాబాద్.మే 14(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆరోగ్య కేంద్రం భవనాన్ని గురువారం డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రవణ్ కుమార్ సందర్శించి భవన నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో చేపట్టిన నిర్మాణ పనుల పురోగతిని ఆయన పరిశీలించి, ఇంకా పూర్తి కావాల్సిన పనులపై అధికారులతో చర్చించారు.
భవన నిర్మాణంలో ఉన్న లోటుపాట్లు, సాంకేతిక సమస్యలు, పెండింగ్‌లో ఉన్న పనులపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలతో ఆరోగ్య కేంద్రాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. నిర్మాణ పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. ఆరోగ్య కేంద్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే గ్రామ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అనిల్‌తో పాటు వైద్య సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments