ప్రజా సమస్యలపై పోరాడిన ప్రజానాట్యమండలి చరిత్ర గొప్పది.
Views: 7
On
ఎల్కతుర్తి, మే 14( తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఎల్కతుర్తి మండల కేంద్రంలో గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మండల కార్యదర్శి శనిగరపు రాజ్‌కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఊట్కూరు రాములు, కర్రే లక్ష్మణ్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజనర్సు పాల్గొని మాట్లాడారు.
ప్రజా సమస్యలపై పోరాడిన ప్రజానాట్యమండలి చరిత్ర ఎంతో గొప్పదని వక్తలు పేర్కొన్నారు. 1943లో ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఐపిటిఏ) స్థాపనతో ప్రజా చైతన్యానికి శ్రీకారం చుట్టిన ప్రజానాట్యమండలి, పాటలు, నాటకాలు, బుర్రకథలు, యక్షగానాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించిందన్నారు. తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో ప్రజానాట్యమండలి కీలక పాత్ర పోషించిందని తెలిపారు.
“మా భూమి”, “ముందడుగు” వంటి నాటకాలు ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపాయని, జానపద కళారూపాల ద్వారా సామాజిక సమస్యలను ప్రజల ముందుకు తీసుకువచ్చిందన్నారు. బుర్రకథ, డప్పు, కోలాటం వంటి కళారూపాలను పరిరక్షిస్తూ ప్రజానాట్యమండలి సమాజ చైతన్యానికి కృషి చేస్తోందని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలపై కళారూపాలతో చైతన్యం కల్పిస్తూ ప్రజానాట్యమండలి తన కార్యక్రమాలను కొనసాగిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు తండా మొండయ్య, వేముల కృష్ణకర్, బిల్కూరు తులసిరామ్, ఎర్ర ప్రకాష్, రాజం రాజు, ఎండీ రహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments