జమ్మికుంటలో మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ.

జమ్మికుంటలో మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ.

జమ్మికుంట టౌన్ మే 08 (తెలంగాణ ముచ్చట్లు):
 
జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, సుంకర రమేష్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 59వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
అనంతరం జమ్మికుంట పట్టణ శివాలయంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న-కోటి అధ్యక్షతన మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవాభావంతో ముందుకు సాగుతున్న నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు.
బీసీ సంక్షేమం, రవాణా రంగ అభివృద్ధి, సామాన్య ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి మరెన్నో ఉన్నత స్థానాలు కల్పించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మరింత సేవాభావంతో ప్రజలకు సేవ చేయాలని సభలో పాల్గొన్న డిసిసి వైస్ ప్రెసిడెంట్‌లు, IMG-20260508-WA0087పిసిసి ప్రచార కమిటీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ వైస్ చైర్మన్, మార్కెట్ డైరెక్టర్లు, ఇల్లంతకుంట దేవాలయాల డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు.
Tags:

Post Your Comments

Comments

Latest News