“ప్రజాస్వామ్యాన్ని దాడులతో అణిచేయలేరు”… కాంగ్రెస్ నేత ఆర్‌ఎస్ గౌడ్ ఫైర్.
Views: 3
On
జమ్మికుంట టౌన్ మే 07 (తెలంగాణ ముచ్చట్లు):
“ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉంది. రాజకీయ విమర్శలకు ప్రతివిమర్శలతో సమాధానం ఇవ్వాలి గానీ… కార్యాలయాలపై దాడులు చేయడం, కార్లు ధ్వంసం చేయడం రౌడీయిజానికి నిదర్శనం” అంటూ కాంగ్రెస్ నాయకుడు ఆర్‌ఎస్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరీంనగర్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ ఉద్రిక్తతలు, దాడుల ఘటనలపై స్పందించిన ఆయన… ప్రజాస్వామ్య వ్యవస్థలో భయభ్రాంతులకు తావులేకుండా ప్రతి ఒక్కరికీ అభిప్రాయం వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉండాలని అన్నారు. రాజకీయ కక్షలతో హింసాత్మక ఘటనలకు పాల్పడడం సమాజానికి ప్రమాదకరమని పేర్కొన్నారు.
శాంతిభద్రతలను భంగం కలిగించేలా వ్యవహరించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీల మధ్య విభేదాలు సహజమే కానీ, వాటిని హింసాత్మక దాడుల రూపంలో ప్రదర్శించడం ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చే చర్యలని విమర్శించారు.
ప్రజల సమస్యలపై చర్చలు జరగాల్సిన సమయంలో దాడులు, బెదిరింపులు చోటుచేసుకోవడం దురదృష్టకరమని ఆర్‌ఎస్ గౌడ్ అన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments