గీత కార్మికుల చేత శీలం అనిల్ కుమార్ దంపతులకు ఘన సన్మానం.

గీత కార్మికుల చేత శీలం అనిల్ కుమార్ దంపతులకు ఘన సన్మానం.

ఎల్కతుర్తి, మే 05 (తెలంగాణ ముచ్చట్లు):

శ్రీ రేణుక ఎల్లమ్మ ఎల్కతుర్తి తిరుగు వారం మహోత్సవం లో భాగంగా ఎల్లమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో గీత కార్మికులు హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి మండల అధ్యక్షుడు శీలం అనిల్ కుమార్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా శీలం అనిల్ కుమార్ మాట్లాడుతూ ఎల్లమ్మ పండుగను గీత కార్మికులు, గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారని తెలిపారు. పండుగ నిర్వహణలో అందరి పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. హిందూ దేవాలయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, సంప్రదాయాలు మరియు ఆచారాలను కాపాడుకోవడం ద్వారా మన సంస్కృతి నిలబెడతామని అన్నారు.
గ్రామంలో గీత కార్మికుల కష్టాలు, వారి జీవన విధానం గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ, వారికి మరింత ప్రోత్సాహం అందించాలని కోరారు. గీత కార్మికులు గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అభినందించారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు గొడిశాల కుమారస్వామి, శ్రీపతి సదానందం, బిక్షపతి, లక్ష్మన్న, సంపత్, అశోక్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం అందరికీ ప్రసాదం పంపిణీ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పశువుల అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన నిఘా. పశువుల అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన నిఘా.
మంచిర్యాల. మే 05(తెలంగాణ ముచ్చట్లు)   రానున్న బక్రీద్పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని మంచిర్యాల జోన్ పరిధిలో ప్రత్యేక చర్యలు...
సేంద్రియ సాగుతో భూమికి శక్తి  రైతుల భవిష్యత్తుకు భరోసా.
మహిళలకు స్వయం ఉపాధి దిశగా మినీ డైరీ యూనిట్లు.
గీత కార్మికుల చేత శీలం అనిల్ కుమార్ దంపతులకు ఘన సన్మానం.
ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయం..
వంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.
నకిలీ పత్రాల ఫోర్జరీ కేసులో నిందుతుడు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు.