బలీదుపల్లిలో ఐకేపీ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం.

బలీదుపల్లిలో ఐకేపీ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం.

అడ్డాకల్,ఏప్రిల్20(తెలంగాణ ముచ్చట్లు):
 
 మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం బలీదుపల్లి గ్రామంలో నర్సరీ సమీపంలో ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాన్ని గ్రామ మహిళా అధ్యక్షురాలు మంగరాయి భార్గవి సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏపీఎం మహేష్ మాట్లాడుతూ రైతులు అందరూ ఈ వరి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర ప్రయోజనాలను పొందేందుకు రైతులు తమ వరిని నేరుగా కేంద్రానికి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీసీ యాదగిరి, సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి కళ్యాణి, ఏఈఓ మదన్ మోహన్, ఉప సర్పంచ్ రాధ శివ, మహిళా సంఘం కార్యదర్శి మైముద్, కోశాధికారి సంధ్య, బుక్ కీపర్ శ్రీధర్, వార్డు సభ్యులు, గ్రామ నాయకులు, రైతులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .